ICC Cricket World Cup 2019:David Warner's accomplished 166 was the bedrock for a 48-run win that took holders Australia top of the World Cup table and damaged Bangladesh's chances of making the semi-finals.
#iccworldcup2019
#ausvban
#australiavsbangladesh
#fafduplessis
#davidwarner
#stevesmith
#cricket
#teamindia
గురువారం నాటింగ్‌హామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పాకిస్తాన్, శ్రీలంకలను ఓడించి జోరుమీదున్న ఆసీస్.. బంగ్లాదేశ్‌ను మట్టికరిపించి 'హ్యాట్రిక్' విజయాన్ని అందుకుని సెమీఫైనల్‌కు మరింత చేరువైంది. ఇక టోర్నీలో విజయాలు సాధిస్తూ అద్భుత ఫామ్‌లో ఉన్న బంగ్లాదేశ్ కూడా ఆసీస్‌పై బాగానే పోరాడింది. అయితే భారీ లక్ష్యం (382 పరుగులు) ముందుండడం.. బలమైన ఆసీస్ బౌలింగ్‌ను ఎదుర్కొలేక విజయానికి కొద్ది దూరంలో నిలిచింది. ముష్ఫికర్ రహీమ్ అజేయ సెంచరీతో పోరాడినా బంగ్లాను గెలిపించలేకపోయాడు.
382 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాకు మంచి ఆరంభం లభించలేదు. నాలుగో ఓవర్‌లోనే ఓపెనర్ సౌమ్య సర్కార్ (10)ను ఫించ్ రనౌట్ చేశాడు. సీనియర్లు తమీమ్ (62), షకీబ్ (41) కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరు 14 ఓవర్ల పాటు ఆసీస్‌ను దీటుగా ఎదుర్కొంటూ రెండో వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 19వ ఓవర్‌లో స్టొయినిస్.. షకీబ్‌ను అవుట్ చేశాడు. భారీ ఇన్నింగ్స్ ఆడుతాడని ఆశలు పెట్టుకున్న బంగ్లాను అతడు నిరాశపరిచాడు.
మరోవైపు 65 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తమీమ్‌ను అద్భుత బంతితో స్టార్క్ బౌల్డ్ చేయడంతో బంగ్లా కష్టాల్లో పడింది. లిటన్ దాస్ (20) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఈ దశలో ముష్ఫికర్, మహ్ముదుల్లాలు పోటీపడి దూకుడుగా ఆడారు. 54 బంతుల్లో ముష్ఫికర్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా.. జంపా ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదిన మహ్ముదుల్లా 41 బంతుల్లోనే అర్ధ సెంచరీ అందుకున్నాడు.